నేటి నుంచి సీపీఐ సమావేశాలు
బీహార్ ఎన్నికల్లో వ్యవహరించవలసిన తీరును చర్చించేందుకు సీపీఐ అగ్ర నేతలు సోమవారం చం డీగఢ్‌లో భేటీ కాబోతున్నారు.ప్రభుత్వ ఆర్థిక, ఇతర విధానాలపై నిరసన తెలియజేసేందుకు ఇతర వామప క్షాలు, ప్రజా సంఘాలతో కలిసి ఆందోళన కార్యక్రమాల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావే శాలు మూడు రోజుల పాటు జరుగుతాయి. ఇటీవలి జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చ జరుగు తుంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఏడాది పాలన, భూసేకరణ ఆర్డినెన్స్, భూ సం స్కరణలు, లలిత్ మోడీ వివాదం తదితర అంశాలు ఎజెండాలో ఉన్నాయి. సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా మాట్లాడుతూ బీజేపీ హామీ ఇచ్చిన ''మంచి రోజులు'' పీడకలగా మారాయన్నారు. లలిత్ మోడీ వివాదంలో వ్యాపార లావాదేవీల దగ్గర నుంచి మనీలాండరింగ్ వరకు అనేక కోణాలు ఉన్నాయన్నారు. దీనిలో వసుంధర రాజే, సుష్మా స్వరాజ్ ప్రమేయం ఉందన్న ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు. మధ్యప్రదేశ్‌లో వ్యాపం కుంభకోణం నిందితులు అనుమానాస్పదంగా మరణిస్తు న్నారన్నారు. వీటన్నిటినీ చూసినపుడు మంచిరోజులు వస్తాయంటూ బీజేపీ ఇచ్చిన హామీలు పీడ కలగా మారిందన్నారు. మాంద్యం వంటి పరిస్థితులు వస్తున్నాయని ఆర్బీఐ గవర్న ర్ చెప్తున్నారని, ఆర్థిక వ్యవస్థ దయనీయంగా ఉందని అన్నారు. వ్యవ సాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తయారీ రంగం, చిన్న, మధ్య తరహా పారిశ్రామిక రంగం కష్టాల్లో ఉన్నాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ధరలు తక్కువగానే ఉన్నప్పటికీ నిత్యా వసర వస్తువుల ధరలు పెరు గుతున్నాయని వాపోయారు
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








